సినిమాల్లో తీసే ప్రతి సీన్ నిజజీవితంలో ఎక్కడో ఒకచోట జరిగే ఉంటుంది.  అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యి తీస్తుంటారు. జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేం.  చెప్పలేము కాబట్టే అది జీవితం.. ఊహించలేము కాబట్టే అది లైఫ్.  రియల్ లైఫ్ లో అందరికి కంటతడి పెట్టించే సన్నివేశం ఒకటి జరిగింది.  

అదేమంటే.. బీహార్ లోని రోహతక్ జిల్లాలోని బదిలాదిహ్ గ్రామానికి చెందిన జ్యోతిప్రకాష్ నీరలా సైన్యంలో చేరాడు.  ధైర్యసాహసాలు ప్రదర్శించడంలో నీరలా ఎపుడు ముందు ఉండేవాడు.  2017 నవంబర్ 18 వ తేదీన ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో నీరలా అశువులు బాశారు.  లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ష్కరే కమాండర్ లఖ్వీ అల్లుడు ఉబేద్ అలియాస్ ఒసామా - మహమూద్ భాయి అనే ఇద్దరు ముష్కరులను నీరాల మట్టుబెట్టాడు.  

సైన్యంలో చేరిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది.  ఇదిలా ఉంటె, నీరలా సోదరికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది.  ఆ వివాహ పత్రికను ఆర్మీ ఆఫీసర్ కు మర్యాదపూర్వకంగా పంపింది.  నీరలా చేసిన త్యాగాన్ని, ధైర్యసాహసాన్ని గుర్తించిన ఆర్మీ,  సోదరి వివాహం కోసం 50 మంది సైన్యాన్ని పంపించింది. 

ఈ యాభైమంది సైనికులు సోదరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిగిపించారు.  సొంత సోదరి వివాహం ఎలా చేస్తారో అలా దగ్గరుండి చేశారు.  అన్నలుగా ఈ పెళ్లికోసం వాళ్ళు 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.  మేము దేశం కోసం ఒక్క కొడుకుని పోగొట్టుకుంటే..మాకు 50 మంది కొడుకులను దేశం అందించింది.  అంతకంటే ఇంకేంకావాలి అని ఆ తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ధైర్యసాహసాలు ప్రదర్శించిన నీరలాకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకైనా అశోక చక్ర పురస్కారాన్ని అందించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: