నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు  తెలంగాణా సీఎం విజయవాడ రూట్ పట్టడం చూస్తూంటే జగన్ పూర్తిగా  సీఎమ్ కుర్చీలో  కుదురుకుంటే అపుడు పరిస్థితి ఏంటన్నది వూహకే అంతుపట్టడంలేదు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైజింగ్ స్టార్ గా ఉన్నారు. ఇపుడు దేశంలో ప్రతి చోటా ఏపీ గురించి చర్చ జరిగేలా జగన్ చేస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే తన పాలనా సామర్ధ్యాన్ని నిరూపించుకున్న జగన్ అటు కేంద్రంలోని మోడీ గుడ్ లుక్స్ లో కూడా ఉన్నారు. 


జగన్ భారీ మెజారిటీతో గెలవడమే ఒక్కసారిగా దేశాన్ని ఆకట్టుకుంది. ఆ తరువాత ఆయన చూపిస్తున్న వేగం కూడా అన్ని రాజకీయ పక్షాలను ఇటు వైపు చూసేలా చేశాయి. ఓ విధంగా సౌతిండియా నుంచి యూత్ లీడర్ గా జగన్ ఎదురుగుతున్నారనే చెప్పాలి. నిన్నటివరకూ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణాలో కేసీయార్ కొత్త ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో కేసీయార్ని చూసి బాబును నేర్చుకోమనేవారు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారని కేసీయార్ కి పేరు. ఇపుడు జగన్ సీఎం అయ్యాక కేసీఅయర్ కి కొత్త బాధ మొదలైంది.


 జగన్ని చూసి నేర్చుకోమని అక్కడి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. యువకుడుగా ఉంటూ పాలనలో తనదైన జోరు చూపిస్తున్న జగన్ని రోల్ మోడల్ గా తీసుకోమంటున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ జగన్ చుట్టూ తిరుగుతోంది. ప్రధాని మోడీ తిరుపతి పర్యటనలో జగన్ కి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే భావి అవసరాలకు జగన్ని మిత్రుడిగా చేసుకునేందుకు మోడీ షా టీం వ్యూహరచన చేస్తోందనిపిస్తోంది.  .  కాగా  పక్కన ఉన్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన తనయుడు నిఖిల్ గౌడాను జగన్ వద్దకు రాయబారానికి పంపడం బట్టి చూస్తూంటే జగన్ ఇప్పటికైతే దక్షిణాదిన బాగానే ప్రభావం చూపిస్తున్నారనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: