తెలుగుదేశం పార్టీ 2009 లో పార్టీ ప్రచారం కోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దించింది.  ఎన్టీఆర్ ను ప్రచారానికి వినియోగించుకుంది.  పాపం ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం తిరిగాడు.  తన ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు.  కానీ, లాభంలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి వంటి బలమైన నాయకుడు అధికారంలో ఉండటంతో సాధ్యం కాలేకపోయింది.  


2009 ఎన్నికల తరువాత ఎన్టీఆర్ ను టీడీపీ పూర్తిగా పక్కన పెట్టింది.  దీంతో చేసేదిలేక ఎన్టీఆర్ తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు.  ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఎన్టీఆర్.  రాజకీయాలవైపు చూసేందుకు కూడా సమయం లేదు.  రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వాటి గురించే మాట్లాడని ఎన్టీఆర్ గురించి ఇప్పుడు అసెంబ్లీలో వినిపిస్తున్నాయి.  


వైకాపా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా.. ఈరోజు అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడింది.  ఎన్టీఆర్ గురించి అంటే టిడిపి ఆయనకు వాడుకుంది అనే టైపు లో కాకుండా.. తనదైన స్టైల్ లో అరవింద సమేత సినిమాలోని డైలాగ్ ను యాజ్ టీజ్ గా అసెంబ్లీలో ప్రస్తావించింది.  


ప్రతి 30 ఏళ్లకీ బ్రతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. వ్యాపారులు ఫ్యాషన్ అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త ఆలోచనను ముందుకు తీసుకెళ్లేవాడు ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు...  ఇది అరవింద సమేత సినిమా డైలాగ్ దీనిని అలాగే చెప్తూ.. జగన్ ఇప్పుడు టార్చ్ బేరర్ అని చెప్పింది.  రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పాదంలో పురోగమిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి కావడం నవశకానికి నాంది అని రోజా చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: