తెలుగుదేశం పార్టీ ఈసారి దారుణంగా ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అన్న కారణం తెలియడం లేదని చంద్రబాబు తెలివిగా అంటున్నారో, తెలియక అంటున్నారో తెలియదు కానీ తమ్ముళ్ళకు మాత్రం చాలా కారణాలు ఓటమికి కనిపిస్తున్నాయి. టీడీపీ ఓటమికి ఎన్నో కారణాలు అంటూ బాబు కోటరీలోని కీలక తమ్ముడు అసలు గుట్టు చెప్పేశారు.


చంద్రబాబే మొత్తానికి కారణమని కూడా తేల్చేశారు. చంద్రబాబు పార్టీని చాలా నిర్లక్ష్యం చేశారని బాబు కుడి భుజం లాంటి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి హాట్ కామెట్స్ చేశారు. బాబు అయిదేళ్ల కాలంలో అనేక తప్పులు చేశారని ఆయన సుత్తి లేకుండా సూటిగానే చెప్పేసారు. మరీ ముఖ్యంగా  కేంద్రంలోని బీజేపీ నుండి విడిపోవడం ఘోరమైన తప్పు అని ఆయన అన్నారు. ఆనాడే తాను ఈ విషయంలో బాబుకు చెప్పానని కూడా గుర్తు చేశారు.


ఏపీలో ఉనికే లేని కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవడం, అసలు  పెద్దగా బలం లేని బీజేపీతో రాజకీయ యుధ్ధం చేయడం దారుణమైన ఫెయిల్యూర్ వ్యూహాలు అని సుజనా గట్టిగానే కడిగేశారు. ఇక పార్టీలోనూ, పాలనలోనూ అంతటా కేంద్రీక్రుత అధికారం రాజ్యం చేసిందని అన్నారు. ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతికి పాల్పడితే వారిని తప్పించాల్సింది పోయి టికెట్లు ఇచ్చారని సుజనా చౌదరి అన్నారు. పార్టీని చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని  ఆయన విమర్శించారు.
పోలిటి బ్యూరో మీటింగులు మొక్కుబడిగా కాక   పొలైట్ గా జరగాలని చురకలు అంటించారు. మొత్తానికి బాబుకు ఎన్నో విషయాలు చెప్పి ఓటమికి మీరే కారణమని కళ్ళు తెరిపించేశారు సుజన చౌదరి.  దీని మీద బాబు గారేమంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: