ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా కావాలి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తే కేంద్రం నుండి 90%నిధులు గ్రాంట్ రూపంలో 10% అప్పు రూపంలో లభిస్తుంది.పరిశ్రమలకు , ఎక్సైజ్ డ్యూటీలకు, ఆదాయపు పన్నుకు రాయితీలు లభిస్తాయి. పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపిస్తాయి. 
 
కానీ గత 5 సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకై పోరాడటంలో విఫలమయ్యారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. కానీ నిధులు కేంద్రం నుండి విడుదల చేసుకోవటంలో మాత్రం విఫలమయ్యారు. అందువలన ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయారు. 
 
కానీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేకహోదాకు మొదటినుండి కట్టుబడి ఉన్నారు.ప్రధాని మోడీని కలిసిన ప్రతిసారి ఈ విషయం గురించి చర్చిస్తూనే ఉన్నాడు. నీతి అయోగ్ సమావేశంలో కూడా ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి జగన్మోహన్ రెడ్డిగారు వివరించి చెప్పారు.కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేక హోదా విషయంలో కొంతమంది విమర్శిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఎంత ప్రయత్నించాలో అంతకంటే ఎక్కువగానే ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ప్రత్యేక హోదా విషయంలో సానుకూలంగానే ఉంది. అనవసరంగా ఈ విషయంలో జగన్ గారిని విమర్శించడం వలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: