పాపం చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత దారుణంగా మారిపోయిందో చెప్పక్కర్లేదు.  కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ... ఆ 23 మందిలో కొంతమంది జంప్ కావడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది వైకాపా వైపు చూస్తుంటే.. మరికొందరు బీజేపీవైపు చూస్తున్నారు.  చివరకు పార్టీలో ఎంతమంది ఉంటారు అన్నది చూడాలి. 

దీంతోపాటు పార్టీలో అంతర్గత కలహాలు కూడా టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు.  బహిరంగంగా ఆ విషయాలు బయటకు రాకపోయినా..అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా ఉంటున్నాయి. మరోవైపు కెసిఆర్, జగన్ లు ఇద్దరు కలిసి రాసుకుపూసుకు తిరగడంతో పాటు.. ఇద్దరు వరసగా భేటీ అవుతూ.. రాష్ట్రాల సమస్యల పై చర్చించుకుంటున్నారు. 


అంతేకాకుండా, సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన నిర్ణయాల గురించి కూడా భేటీ అవుతున్నారు.  పాలనలో దూసుకుపోతున్న జగన్ కు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు కెసిఆర్.  ఇది బాబుకు నచ్చడంలేదు.  న్యూక్లియర్ బాంబుల మధ్యలో కూర్చున్నట్టుగా ఉన్నది బాబు పరిస్థితి.  


కెసిఆర్, జగన్ లో ఇలా చేస్తుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బాబును ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నది.  నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి.. సడెన్ గా బయటకు వచ్చి కాంగ్రెస్ తో చేతులు కలపడం మోడీకి నచ్చలేదు.  ఇప్పుడు టిడిపి అధికారంలో లేదు కాబట్టి కేంద్రం ఏం చేస్తుందో అని భయపడుతున్నాడు బాబుగారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: