వైసీపీకి వెన్నుపోటు పొడిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజ‌కీయ కెరీర్ అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే కొంద‌రి పొలిటిక‌ల్ కెరీర్ పూర్తిగా నాశ‌నం అవ‌గా...తాజాగా మ‌రో నేత కెరీర్ ఇంకో వేదిక‌కు చేరింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు ఎంపీగా విజయం సాధించి అనంత‌రం వైసీపీకి దూరమై తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్త‌ప‌ల్లి గీత మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఊహించ‌ని రీతిలో అయితే, ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన కొత్తపల్లి గీత అమిత్‌షా సమక్షంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొన్నారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న రాంమాధవ్‌ ఆమెను అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారు.

 

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్తపల్లి గీత ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు. అనంతరం టీడీపీ, బీజేపీలలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ.. అవేమీ జరగలేదు. చివరకు ఆమె కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని నెలలుగా తటస్థంగా ఉన్న కొత్తపల్లి గీత అనంత‌రం తన సొంత పార్టీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే, ఎన్నిక‌లు ముగిసిన కొద్దికాలానికే ఆమె బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడంతో... ఇప్పుడు జన జాగృతి పార్టీ కూడా బీజేపీలో విలీనమైపోయినట్టే అని అంటున్నారు.

 

ఇదిలాఉండ‌గా ఏపీపై స్పెస‌ల్ ఫోక‌స్ పెట్టి భారతీయ జనతా పార్టీ నేత‌లు తమతో ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు...! మేం పిలిస్తే నేతలు  వచ్చి పార్టీలో చేరుతారనే మాటలను నిజం చేసేలా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆ పార్టీలో చేరార‌ని అంటున్నారు. ఇదే ఒర‌వ‌డి రాజ‌కీయాల‌లో క్రియాశీలంగా లేని కొంద‌రు నేత‌లు, ప్ర‌స్తుతం గెలిచిన వారు స‌హా మ‌రికొంద‌రు ప్రజాప్ర‌తినిధులు సైతం బీజేపీలో చేర‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: