టీడీపీ పార్టీ ఎన్నికల్లో  ఘోర పరాజయం చెందడంతో ఇప్పుడు ఆ పార్టీలో నాయకత్వ మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీలోని ఒక వర్గం ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేస్తుంది. ఎన్టీఆర్ వస్తే పార్టీ క్యాడర్ లో నెలకొని ఉన్న నైరాశ్యం తగ్గుతుందని, పార్టీలోకి కొత్త ఉత్సాహం వస్తుందని పలువురు  ద్వితీయ శ్రేణి నాయకులూ, కార్య కార్యకర్తలు బాబు గారి దగ్గర చెప్పుకొచ్చారంటా .. దీనితో బాబుగారు ఒకింత అసహానానికి గురయ్యారని తెలుస్తుంది. 


బాబు గారు స్పందిస్తూ, జూనియర్ వచ్చి ఇప్పుడేం చేస్తారు. మా కుటుంబం లోనుంచి ఎవరు రారని మనమే కష్టపడి పార్టీని రక్షించుకోవాలని హిత బోధ చేసారని సమాచారం. దీనితో వారు చేసేదేమి లేక అక్కడనుంచి వెనుదిరిగినారు. అయితే జూనియర్ ఎంట్రీ గురించి పలువురు స్పందించిన సంగతీ తెలిసిందే. జూ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఓ వర్గం భావిస్తోంది.


దీనిపై మీరేమంటారు? అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ... ‘‘మళ్లీ ఆ సీనియర్ ఎన్టీఆర్ వచ్చినా, జూ ఎన్టీఆర్ వచ్చినా ఇక్కడంటూ ఒక ప్లేస్ అంటూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించడం లేదు, ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు, ప్రజా సేవ చేయడం లేదు అనే పరిస్థితి ఉంటే ఆ ప్లేస్ దొరుకుతుంది. అని పోసాని వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: