టీడీపీ అధినేత చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. జగన్ పదేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నేత. చిత్రంగా ఈ ఇద్దరి మధ్యనే ఏపీ రాజకీయం మొత్తం రౌండ్ కొడుతోంది. గత అయిదేళ్ళు బాబు సీఎం, జగన్ విపక్ష నేత. ఈసారి జగన్ సీఎం అయ్యారు. బాబు ప్రతిపక్షానికి వచ్చారు. ఇద్దరి పోరు మళ్ళీ షురూ.


ఇదిలా ఉండగా గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీలా తాము కబుర్లు చెప్పమని, పని జరిగేలా చూస్తామని సెటైర్లు వేశారు. 2029, 2050 అంటూ విజన్, మిషన్లు పేరిట ఆర్భాటాలు ఉండవని అన్నారు. తాము ఏమి చెబుతామో అదే చేస్తామని, మొత్తం అయిదేళ్ల కాలంలో చెప్పింది చేస్తామని జగన్ అన్నారు.


గత ప్రభుత్వం చంద్రబాబు పాలనలో ఇసుక, నీరు, చెట్లు అన్నీ మొత్తం దోచేశారని జగన్ మండిపడ్డారు. వాటి అన్నింటి మీద విచారణ జరిపిస్తామని అయన స్పష్టం చేశారు. ఒక్కో శాఖలో అవినీతి కధలను బయటకు తీసి శ్వేత పత్రం విడుదల చేస్తామని, అవినీతిపరులకు  శిక్ష  తప్పదంటూ అసెంబ్లీ సాక్షిగా బాబు అండ్ కోకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. మరి జగన్ దూకుడు చూస్తూంటే విచారణలకు బాబు తో సహా తమ్ముళ్ళు రెడీ అయిపోవాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: