అధికారిక కార్యక్రమాలతో 2019 ఎన్నికల వరకూ ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకునేందుకు యూరప్‌ వెళ్లనున్నారు. గత రెండు దఫాలుగా అధికారికంగా ప్రభుత్వ సామ్ముతో ప్రయాణాలు సాగించిన చంద్రబాబునాయుడు 10 ఏళ్ల అనంతరం ప్రతిపక్ష హోదాలో ఈ ప్రయాణం చేయనున్నారు.


టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ తాజా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంభ సభ్యులతో సహా యూరప్‌ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రనికే హైదరాబాద్‌ సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రహ్మణి, మనుమడు దేవాంశ్‌లతో పాటుగా చేరుకున్నారు. ఈ నెల 26న తిరిగి ఇండియాకి రానున్నారు. 


కుటుంభ సభ్యులతో పాటు వెళ్తున్నప్పటికీ ఈ పర్యటన వెనుక రహస్యం ఇప్పటికీ గోప్యంగానే ఉంది. ఆంతరంగిక వ్యవహారాలేమై ఉంటాయనే కోణంలో కొందరు ఆయన సన్నిహితుల ద్వరా సమాచారం రాబట్టేందుకు యత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో సమాదానం చెప్పుకోగలిగే పరిస్థితిని కోల్పోయిన ప్రతిపక్ష నేత, ఆయన అనుయాయులు తాజాగా యూరప్‌ పర్యటనతో వేసే ఎత్తుగడలేమిటనే సంధిగ్ధం సర్వత్రా నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: