నిన్ననే ముగిసిన మొదటి అసెంబ్లీ సమావేశాలను జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం అర్ధమవుతుంది.  టిడిపి అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేత చంద్రబాబునాయుడును మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పూర్తిగా డామినేట్ చేసేశారు. విషయం ఏదైనా కానీండి టిడిపి తరపున మాట్లాడిన వాళ్ళల్లో అచ్చెన్నాయుడే ముందున్నారు. తర్వాత బుచ్చయ్యచౌదరి మాట్లాడారు.

 

ఏ అంశంపైనైనా మామూలుగా అయితే శాసనసభా పక్ష నేతలే మాట్లాడుతుంటారు. అందులోను చంద్రబాబు సభలో ఉండగా మరో నేతకు అవకాశం వస్తుందని ఆశించటం కూడా అనవసరం. మైక్ ఎదురుగా ఉందంటే చంద్రబాబు మాట్లాడకుండా ఉండగలరా ? మీడియా సమావేశాల్లోనే గంటల తరబడి మాట్లాడుతారు. అంతెందుకు సిఎంగా ఉన్నపుడు కూడా ఇదే అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడిన విషయాలను ఎలా మరచిపోగలరు ?

 

మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సీన్ రివర్సయిపోయింది. అసెంబ్లీలో టిడిపికి ఉన్నదే 23 మంది ఎంఎల్ఏలు. అందులోను వాగ్ధాటి బాగా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అందుకే అడ్డదిడ్డంగా వాదించే అచ్చెన్ననే చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ శాఖను సమీక్షించినా చంద్రబాబు చేసిన కంపే బయటపడుతోంది.

 

ఈ నేపధ్యంలోనే ప్రతీ అనర్ధానికి జగన్ అండ్ కో చంద్రబాబునే వాయించేస్తున్నారు. వినటానికి కాస్త కఠినంగా ఉన్నా వాస్తవం కూడా అదే. అందుకే చంద్రబాబు కూడా ఏమీ మాట్లాడలేక తలదించుకుంటున్నారు. అందుకనే జగన్ అండ్ కో తనను వాయించేస్తున్నా సమాధానం చెప్పలేక మొహం మాడ్చుకుని కూర్చుంటున్న విషయం టివిలు చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది.

 

ఈ పరిస్ధితుల్లో తాను గనుక ఏమన్నా మాట్లాడితే వైసిపి సభ్యులు మరింత రెచ్చిపోతారన్న టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది. అందుకనే ప్రతీ విషయానికి ముందుగా అచ్చన్నే లేస్తున్నారు. ఏదేమైనా సభలో చంద్రబాబును అచ్చెన్న డామినేట్ చేస్తున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. కాకపోతే అచ్చెన్న డామినేషన్ కూడా వైసిపి సభ్యుల ముందు తేలిపోతోంది లేండి.


మరింత సమాచారం తెలుసుకోండి: