రోజా వైకాపా ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలో కలిసి ఉన్నారు.  కలిసి ఉండటమే కాదు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన  రోజాకు మంత్రి వర్గంలో తప్పకుండా స్థానం ఉంటుందని అందరు అనుకున్నారు.  కానీ, ఫైర్ బ్రాండ్ అనే కారణంతోనూ అలాగే, సమీకరణాల కారణంతోనూ రోజాను పక్కన పెట్టారు. 


అయితే, ఆమెకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్ట్ ను ఇవ్వడంతో ఇచ్చారు.  రెండున్నర సంవత్సరాల తరువాత తిరిగి ఎలాగో మంత్రివర్గాన్ని తిరిగి విస్తరిస్తారు కాబట్టి ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నది.  


జగన్ కూడా ఆమెకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటె, రోజాకు ఇప్పుడు మరో కీలక పదవిని జగన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  జగన్ ఎన్నికల సమయంలో నవరత్నాల హామీని ఇచ్చారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అమలు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు జగన్.  


కాగా, జగన్ ఈ నవరత్నాలను అమలు చేసే విధానం కోసం ఓ కమిటీని వేయబోతున్నారు.  ఈ కమిటీలో అధికారులతో పాటు వైకాపా నుంచి ఒకరిని చైర్మన్ గా నియమించాలని అనుకున్నారు.  ఆ అవకాశాన్ని జగన్ రోజాకు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.  రేపోమాపో దీనికి సంబంధించిన న్యూస్ బయటకు రాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: