``వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నుంచి అన్యాయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ముగ్గురు ఎంపీలు. ఇప్పుడు టీడీపీకి మిగిలింది కూడా అదే! చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23, ఎంపీల సంఖ్య 3. దేవుడు చాలా గొప్పగా ఈ స్క్రిప్ట్ రాశాడు!!`` ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ జ‌గన్‌మోహ‌న్ రెడ్డి ప‌లు సంద‌ర్భాల్లో ఉటంకించిన మాట ఇది. ఇటీవ‌ల విడుద‌లైన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం గురించి జ‌గ‌న్ విశ్లేష‌ణ ఇది. అయితే, చంద్ర‌బాబు జీవితంలో దీనితో పాటుగా ఇంకెన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. అదే విధంగా జ‌గ‌న్ జీవితంలో కూడా!

 

జ‌గ‌న్ జీవితంలో అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల సంఖ్య‌గా పేర్కొన‌వ‌చ్చు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్ ను సీఎం చేయడం కోసం ఏకంగా 151 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి మరి ఇచ్చారు. కానీ అప్ప‌టి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ జగన్‌ను సీఎం ను చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓదార్పు యాత్రకు బ్రేక్ లు వేయాలని తలిచింది.క‌ట్ చేస్తే...2019లో అంధ్రప్ర‌దేశ్‌ ప్రజలు జగన్‌ను సరిగ్గా 151 ఎమ్మెల్యేలతో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఏపీ చ‌రిత్ర‌లో లేని విధంగా రికార్డు స్థాయి విజ‌యాన్ని వైఎస్ జ‌గ‌న్‌కు క‌ట్ట‌బెట్టారు. 

 

 

ఇక, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జీవితంలో దుర‌దృష్టాల సంద‌ర్భంలోనూ ఇలాంటి సంఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఉందంటున్నారు. వ‌ర్తమానం విష‌యానికి వ‌స్తే...2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను పెద్ద ఎత్తున ప్ర‌లోభాల‌కు గురి చేసిన చంద్ర‌బాబు వారిలో 23 మంది ఎమ్మెల్యేల‌ను, 3 ఎంపీల‌ను త‌న గూటికి చేర్చుకున్నారు. ఈ నిర్ణ‌యం అప్ర‌జాస్వామికం ఎందురు అన్న‌ప్ప‌టికీ...బాబు అలా ముందుకు సాగిపోయారు. క‌ట్ చేస్తే...తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో బాబు గెల‌చుకున్న‌ది 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీల‌నే. ఈ ట్రాజెడీతోనే బాబు ఉదంతం ముగియ‌లేదు. 23 సంవ‌త్స‌రాల క్రితం అప్ప‌టి టీడీపీ అధ్య‌క్షుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన‌ చంద్ర‌బాబు ఇప్పుడు త‌న పార్టీలోనూ అలాంటి వెన్నుపోటు ఘ‌ట‌న చోటుచేసుకుంటుందా? అనే భ‌యంతో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా...జగన్ - బాబోరి జీవితాల్లో ఇన్ని కాకతాళీయాలా ? అంటూ ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: