జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో అతి కీలకమైనది అమ్మ ఒడి పధకం. నవరత్నాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పధకం వల్ల ఎందరో పేద విద్యార్ధులకు న్యాయం జరుగుతుంది. ఈ పధకాన్ని వచ్చే ఏడాది జనవరి 26న అమలు చేస్తారు.


అయితే ఈ పధకం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా ప్రభుత్వం ఏడాదికి 15 వేల రూపాయలు సొమ్ము చెల్లిస్తుందని మొదట ప్రచారం అయింది. దాని మీద సర్కార్ బళ్ళ ఉపాధ్యాయులంతా మండిపడ్డారు. ఇక ఉపాధ్యాయ సంఘాలైతే ఈ పరిణామంతో ప్రభుత్వ బళ్ళు చచ్చిపోతాయని అనేశారు. ప్రభుత్వ పాఠశాలలకే దీన్ని వర్తింపచేయాలని కూడా డిమాండ్ చేశారు.


ఇక మేధావులు సైతం ఇదే రకమైనా ఆలోచన చెప్పారు. అన్నీ ఆలోచించిన  మీదట జగన్ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమ్మ ఒడి పధకం కేవలం సర్కార్ బడులకు పిల్లలను పంపిన వారికే తప్ప ప్రైవేట్ వారికి వర్తించదని స్పష్టంగా  చెప్పేసింది. ఈ విధివిధానాలు బట్టి చూస్తే ప్రభుత్వ పాఠశాలాలు పిల్లలతో కళకళలాడే పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం జగన్ సర్వజనామోదమైన నిర్ణయమే తీసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: