విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో వైసీపీ తరుపున అన్ని పనులు చక్కదిద్దుతుంటారు. కేంద్ర ప్రభుత్వానికి, జగన్ కు మధ్య వారధిగా పని చేస్తుంటారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ ప్రధాన అజెండాగా ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ లైబ్రరీ భవంతిలో నాలుగు గంటలపాటు ఈ భేటీ జరిగింది. రాజకీయ పార్టీల సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.


ఇతర నేతలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ప్రధాని మోదీ.. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయ సాయిరెడ్డిని చూసిని ప్రధాని మోదీ ఆగి మరీ ఆయన్ను పలకరించారు. ‘హాయ్ విజయ్‌ గారూ..’ అంటూ విజయసాయిని పలకరించిన మోదీ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రధాని స్వయంగా తనవైపు వచ్చి మరీ పలకరించడంతో విజయసాయి ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.


‘‘ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ లాబీలో శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్‌ గారు' అని పలకరిస్తూ నా వైపు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం’’ అని ప్రధాని మోదీ తనను పలకరిస్తోన్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: