ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని యాధృచ్ఛికంగా జరిగితే..చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవర్ల నిర్లక్ష్యం, అధిక వేగం, లెక్కకు మించి ప్రయాణించడం..ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.  రోడ్డు రవాణా సంస్థ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంది నిర్లక్ష్యమే ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. 


ప్రమాదం అని తెలిసినా ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి ఆరుగురు విద్యార్థులను తీసుకెళుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ద్విచక్రవాహనంపై ముందు ముగ్గురు, అతడి వెనుక మరో ముగ్గురిని కూర్చొబెట్టుకొని వెళుతుండగా సెవెన్‌ టూంబ్స్‌ రోడ్డులో టోలీచౌకి ట్రాఫిక్‌ పోలీసులుపట్టుకొని అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయని, హెల్మెట్‌ కూడా ధరించలేదని, పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తూ తీసుకెళ్లడం సరికాదని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: