పక్క రాష్ట్రాల్లో ఓ వైపు వరదలు ముంచేస్తుంటే..తెలుగు రాష్ట్రాల్లో భానుడు దంచేస్తున్నాడు.  రోజు రోజు కీ ఇక్కడ ఉష్ట్రోగ్రత  పెరిగిపోతూనే ఉంది.  వర్షం అన్న మాట కాదు కదా ఆ ఛాయలు కూడా కనిపించడం లేదు.  పట్టణ వాసులు ఉక్కబోతతో ఇబ్బందులు పడుతుంటే..గ్రామ స్థాయిలో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.  

రాష్ట్రంలో  ఎండ తీవ్రతతో ఉష్ణోగ్రత తీవ్రముగా యుండు కారణముగా జనులు ఇబ్బంది పడుతుండటంచేత సకాలంలో వర్షాలు లేక రైతులు  మరియు వ్యవసాయమునకు ఆటంకము కలుగుచుండుట వలన రాష్ట్రం సస్యస్యామలముగా ఉండుట కొరకు లోక కల్యాణార్థమై వరుణ యాగం కనకదుర్గమ్మ  అమ్మవారి అనుజ్ఞతో కార్యక్రమము దేవస్థాన స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ ఆద్వర్యంలో వేద విద్యార్దులు పండితులు దుర్గ ఘాట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ కార్యక్రమం లో ఆలయ అధికారిణి కోటేశ్వరమ్మ  దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా వరుణ యాగం లో పాల్గొని పూజలు చేశారు. ఉదయం  6 గం.ల దేవస్థాన వేదం విద్యార్థులు మరియు అర్చక స్వాములు దుర్గాఘాట్ నందు వరుణ జపం, వారుణానుపాక పారాయణములు, శతానువాక పారాయణలు మరియు విరాట్ పర్వ పారాయణము జరుగుతుంది. నదీ లో కూర్చుని వేద విద్యార్దులు పండితులు వరుణ జపలు నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: