ఎలాగైనా తన తరువాత ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ ను హీరో చేయాలనీ, లోకేష్ చక్రం తిప్పేలా చేయాలని పాపం బాబుగారు అనుకున్నారు.  దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని ఇచ్చారు.  మంత్రి పదవి తీసుకున్న లోకేష్ ఏం చేశారో... ఎంత వరకు నేర్చుకున్నారో తెలియదు.  


ఎన్నికలకు ముందు లోకేష్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఎలాగైనా గెలుస్తామనే ధీమా ఉంది.  ఈ ధీమాతోనే బాబుగారు లోకేష్ ను మంగళగిరి నుంచి పోటీలో దించారు.  ఎన్నికల ప్రచార సమయంలో అనేక మార్లు లోకేష్ టంగ్ స్లిప్ అయ్యి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు.  


ఇంతవరకు బాగానే ఉన్నది.  ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత లోకేష్ పరపతి ఒక్కసారిగా పడిపోయింది.  తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలు మాత్రమే దక్కించుకోవడంతో తెలుగుదేశం పార్టీ పని ఖతం అనుకున్నారు.  ఈ సమయంలో బాబు లోకేష్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. మొదటికే మోసం వస్తుంది అనుకున్నారు.  అందుకే కొత్త నాయకత్వంపై దృష్టి పెట్టారు. 


పార్టీలో చురుగ్గా ఉంటున్న రామ్మోహన్ నాయుడుకు ఆంధప్రదేశ్ టిడిపి అధ్యక్ష పదవిని ఇస్తున్నట్టు సమాచారం అందుతోంది.  ఎలాగో ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన లోకేష్ కు కనీసం పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించి.. భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దుతారేమో అనుకుంటే.. లోకేష్ కు బాబు అన్యాయం చేసి పార్టీ పగ్గాలు వేరే వాళ్లకు అప్పగించారు.  మరి లోకేష్ పరిస్థితి ఏంటి ఇప్పుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: