చరిత్రలో ఎన్నడూలేని విధంగా టీడీపీ అతి దారుణంగా ఓడిపోవడంతో  ఇప్పుడు టీడీపీ భవిష్యత్తే ప్రశ్నర్ధకంగా మారింది.  రాజకీయ ఎత్తుగడలు వేయటంలో దిట్టగా పేరు ప్రఖ్యాతలు ఉన్న  చంద్రబాబుకు సైతం  పార్టీ వదిలి వెళ్లిపోతున్న నాయకులను ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.  పార్టీను విడిపోతున్నవారి గురించి బాబు వద్ద ప్రస్తావిస్తే.. చంద్రబాబు రెగ్యూలర్ గా చెప్పే డైలాగ్ తోనే ముందుకుపోదామని అంటున్నారట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు నడిచేవాళ్లే కరువయ్యేలా కనిపిస్తున్నారు.       


అయినా బాబు మాత్రం తనతో పాటే అందరిని కూడా ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాబు నాయకులకు ఎన్ని రకాలుగా అట్టి  పెట్టుకునప్పటికీ నాయకులూ  వ్యూహాత్మకంగా తమకు లాభం వచ్చే విధంగానే  నడుచుకుంటారని బాబుకు తెలియంది కాదు. అందుకే చంద్రబాబు నాయుడు రివర్స్ గేమ్ ఆడుతున్నాడట.  తొందరపడకుండా  బాబు కాస్త దూకుడు తగ్గినట్లు కన్పిస్తుంది. ప్రతిదానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. 


అయితే అది తన వయసు వల్ల వచ్చిందా లేక నిజంగానే ఎన్నికల్లో ఓడిపోవడం వల్లే ఇలా పరువు సమస్యతో బాధపడుతూ వెనకడుగు వేస్తున్నారా  అనేది  బాబుకే తెలియాలి. అయితే బాబు ప్రస్తుతానికి ఇలా వెనక్కి తగ్గినా, జగన్ ప్రభుత్వం ఒక్క తప్పు చేసిన మళ్లీ  ఉప్పెనలా విరుచుకుపడతాడు. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో బాబు అలాగే ప్రవర్తించారు.  ఇక మొత్తానికి బాబును కాపాడేది, జగన్ తీసుకునే తప్పుడు నిర్ణయం ఒక్కటే. మరి జగన్ బాబుకు ఆ అవకాశం ఇస్తారా..? కాలమే సమాధానం చెప్పాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: