కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన నా  ఆనందాన్ని  ..ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి  అనే ఉద్యమ ఆకాంక్షను నేర వేర్చే దిశగా ఇది  బలమైన అడుగు.  ఇది తెలంగాణ ప్రజల పోరాట ఫలితం . అమరుల త్యాగాల  ఫలితం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర కృషి ఫలితం.

 

నాటి సమైక్య పాలకులు కావాలనే అంతరాష్ట్ర వివాదాల్లో చిక్కుకొనే  విధంగా , నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టును  డిజైన్ చేస్తే,  గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపర భగీరథుడిలా ..తానే ఒక ఇంజనీర్ గా మారి  అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్టును రీడిజైన్ చేశారు.. మహా రాష్ట్ర తో నెలకొన్న వివాదాన్ని  స్నేహ పూర్వకంగా  పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేశారు.. నిరంతరం పర్యవేక్షిస్తూ రికార్డు సమయంలో ప్రాజెక్టు నిర్మాణం   పూర్తి చేయించిన  గౌరవ  సీఎం కేసీఆర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  

 

ప్రాజెక్టు నిర్మాణం లో ఎండ ,  వాన , చలి ని లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమించిన ఇంజనీర్ల  కు , ఉద్యోగులకు , కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు  పేరున శుభాకాంక్షలు అభినందనలు. ఈ సన్నివేశాన్ని ఆనందబాష్పాలతో  తిలకిస్తున్న తెలంగాణ రైతుల పాదాలకు శిరస్సు వంచి  నమస్కరిస్తున్న... సస్యశ్యామల తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేల ఆశీస్సులు  అందించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.. 

జై తెలంగాణ... జై కిసాన్..

- మీ హరీష్ రావు

మరింత సమాచారం తెలుసుకోండి: