భారతీయ సినిమా దర్శకుల గురించి మాట్లాడుకోవాలంటే అందులో ప్రముఖంగా ఉండే పేరు మణిరత్నం. ఈయన ఈ మధ్య తీస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మణిరత్నం ప్రస్తుతం  పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రాత్మక చిత్రంపై పని చేస్తున్నారు. అయితే ఆయనకు గుండె సంబంధమైన సమస్య కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు.

 

ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి లోకేష్ జే మీడియాకు వెల్లడించారు.అయితే... అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రొటీన్ చెకప్ కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని, ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన అనంతరం తన పనుల్లో నిమగ్నమయ్యారు. మణి సర్ ఆఫీసుకు వచ్చి ఆయన పనిలో మునిగిపోయారని... నిక్కి మురుగన్ సైతం ట్వీట్ చేశారు.మరణిరత్నం కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యతో బాధ పడుతున్నారు.

 

గతేడాది జులైలో ఆయన గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ సారి రోటీన్ చెకప్ కోసమే వచ్చారని, ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మణిరత్నంకు తొలిసారి గుండెపోటు 2004లో యువ సినిమా షూటింగ్‌లో వచ్చింది. సెట్‌లోని ఛాతిలో నొప్పి రాగా, వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాప్రాయం తప్పింది.

 

ఆ తర్వాత దశాబ్దకాలం అనంతరం 2015లో ఒకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి కశ్మీర్‌లో గుండెపోటుకు గురయ్యారు.ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రాత్మక చిత్రంపై పనిచేస్తున్నారు. బాహుబలి రేంజ్‌లో తెరకెక్కించే ఈ చిత్రంలో భారీ రేంజ్‌లో అగ్రనటులను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నది. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: