గతంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయి ప్రతిపక్ష హోదా దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అనంతరం 2019లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజల మెప్పుతో అత్యధిక మెజారిటీతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యలోని ఐదేళ్లలో తాను సహా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమపడ్డారని, వారి శ్రమ వృధాకాలేదని, ప్రజలు దానిని గుర్తించి తమకు అధికారాన్ని కట్టబెట్టారని ఇటీవల జగన్ చెప్పుకొచ్చారు. అయితే అధికారం దక్కింది అనుకోవడం ఎంత సంతోషమో, దానిని నియోగించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం అంత కష్టం అనే అనాలి. 

ఎందుకంటే ఒకసారి సిఎం అయిన తరువాత ఇచ్చిన హామీలు, అలానే ప్రజాసంక్షేమ పథకాలు వంటివి పూర్తిగా ఎప్పటికపుడు అమలు చేస్తేనే కానీ మళ్ళి ప్రజల ఆమోదం పొందలేము. అయితే ఇప్పుడు ఇదే సూత్రాన్ని జాగ్రతగా పాటించి తమ భవిష్యత్తుకు ఎలా బాటలు వేసుకోవాలని పక్కాగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. అధికారాన్ని చేపట్టిన తొలిరోజే నవరత్నాలపై దృష్టి పెట్టిన జగన్, వాటిని సంపూర్తిగా అమలు చేస్తామని, అంతేకాక ప్రజాధనం వృధా చేయకుండా, నిరంతరం తాను మరియు తన పార్టీ మంత్రులు నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని అయన అంటున్నారు. ఇక ఎవరైనా మంత్రి కానీ అధికారి కానీ అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వారిని వెంటనే తొలగించడం జరుగుతుందని కూడా అయన తమ మంత్రిమండలి సభ్యులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. 

అయితే ఈ ఎన్నికల్లో తామిచ్చిన వాగ్దానాలతో పాటు ప్రజలకు అన్నివిధాలా సాయపడి, ప్రతి పేదవాడు కూడు, గుడ్డ, నీడ ఏర్పాటు చేసుకునేలా చూస్తామని వైసిపి శ్రేణులు అంటున్నాయి. ఇక తాము ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేసిన తరువాతనే తదుపరి 2024 ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్తామని, అయితే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి పేరే ఎన్నికల్లో తమకు తారక మంత్రం అని వారు అంటున్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రజలు అయన రాష్ట్రానికి మంచి చేయగలరు అని భావించారు కాబట్టే ప్రజలు ఓట్లేశారని, ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన పేరే తమకు మరొక్కసారి అధికారాన్ని కట్టపెడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: