పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఉండగా టాప్ ప్లేస్ లో ఉన్నారు.  ఎక్కడ ఉన్నా సరే తనదే టాప్ గా ఉండాలని అనుకుంటాడు.  అలా అనుకొనే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాయి.  రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నాడు.  


ఒక రాజకీయ పార్టీని నడపాలి అంటే అంత ఈజీకాదు అని తెలుసుకున్న పవన్.. తిరిగి సినిమా రంగంలోకి వస్తారని అనుకున్నారు అంతా.  కానీ, పవన్ దానికి సిద్ధంగా లేదని అర్ధం అవుతున్నది.  సిద్ధంగా ఉన్నాడు అంటే ఎప్పుడో బయటకు వచ్చేవాడు.  


కానీ, పవన్ అలా కాదు.  సినిమా రంగానికి దూరం అని ప్రకటించేశారు.  ఎవరు ఎన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో పవన్ లేడు.  రాజకీయాల్లోనే ఉంటాను.. రాజకీయాల కోసమే జీవిస్తాను.. చివరి శ్వాస వరకు రాజకీయాలకే ప్రాణం అని చెప్పాడు.  


అయితే, రాజకీయాల్లో ఉండాలి అంటే డబ్బులు కావాలి.  అవి ఎక్కడి నుంచి వస్తాయనే విషయం పవన్ పెద్దగా పట్టించుకోవడం లేదు.  గత నెల రోజుల నుంచి పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు.  మరి ఈ సమయంలో పవన్ కు తోడుగా ఉండే నేతలు ఎవరు..? ఒంటరిగా ఎంతకాలం పోరాటం చేస్తారు.  చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: