ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజుఁయాన్ని మూటగట్టుకున్న టీడీపీ పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో కొంత సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక ఓటమి తరువాత మూడు రోజుల క్రితం ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్ధం పుచ్చుకోవడం ఒక రకంగా ఆ పార్టీకి కొద్దిపాటి దెబ్బె అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి ఓటమికి ప్రధాన కారణాలుగా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నిలబెట్టుకోకపోవడం, అలానే విభజన హామీలు నెరవేర్చకపోవడం వంటివి బాగానే దెబ్బతీశాయని అంటున్నారు. అయితే మొదట్లో హోదా తెస్తానన్న బాబు, ఆ తరువాత ప్యాకేజీకి మొగ్గు చూపడం, ఆపై దానిని కూడా సరిగ్గా రాబట్టలేకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనేది విశ్లేషకులు చెపుతున్న మాట. 

అయితే ఒక్కఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదని, ఇకపోతే గత ఎన్నికల్లో టిడిపితో పవన్ కళ్యాణ్ జనసేన కలిసిరావడం కొంత మంచిదయిందని, ఇక ఈ ఎన్నికల్లో వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేయడం వలన టిడిపి ఓటు బ్యాంకుకు కొంత మేర గండి పడ్డట్లు చెపుతున్నారు. ఇక గత పాలనలో లోపాలు తెలుసుకోవడం, అలానే రాబోయే రోజుల్లో ఎటువంటి హామీలు ఇవ్వాలి, అవి ఎంతవరకు నెరవేర్చగలం అనే భరోసా కలిగించడం వంటివి, రాబోయే ఎన్నికల్లో ప్రజలకు టిడిపిపై కొంతవరకు నమ్మకం కలిగించవచ్చని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం, గతంలో 2009 ఎన్నికల సమయంలో టిడిపికి మద్దతివ్వడానికి ఎన్టీఆర్ గారి మనుమడు జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపికి అయన అవసరం ఎంతైనా ఉందని వారు అంటున్నారు. తాత మరియు తండ్రి నుండి మంచి వాక్చాతుర్యం, ప్రజలను ఆకట్టుకుని పార్టీ విధివిధానాలు వారివద్దకు బలంగా తీసుకెళ్ల గల సమర్ధుడు ఎన్టీఆర్ మాత్రమే అని అంటున్నారు. 

కాబట్టి ప్రస్తుత పరిస్థితిని పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో ఒకసారి సమీక్షించి, అలానే అందరితో కలిసి చర్చించిన తరువాత ఎన్టీఆర్ ని కనుక చంద్రబాబు గారు కలిసి, అయన సాయం తీసుకుంటే టిడిపి పార్టీకి మళ్ళి పునర్వైభవం తప్పకుండా వస్తుందని అంటున్నారు. నిజానికి వారు చెప్పిన మాటల్లో కొంతవరకు వాస్తవం ఉందని, అయితే కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాక, చంద్రబాబు సహా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ఐదేళ్లు శ్రమించి ప్రజల్లోకి వెళ్లి వారి పార్టీ పట్ల నమ్మకాన్ని కనుక కలిగించగలిగితే లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చంద్రబాబు, ఎన్టీఆర్ సాయం తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తారా, లేక మరేదైనా పద్దతిని అనుసరిస్తారా అనేది తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఓపికపట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: