- రూ.12 కోట్ల విలువ చేసే భూమి రూపాయికి విక్రయం
- శారదా పీఠానికి కోకాపేటలో రెండు ఎకరాల కేటాయింపు


 విశాఖ శ్రీ శారదా పీఠానికి ఎకరా భూమి రూపాయి చొప్పున రెండెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామ సర్వే నంబరు 240లో భూమిని కేటాయిస్తూ శనివారం జీవో ఎంఎస్‌ నెం.71ని జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల మేరకు శారదాపీఠం ఆధ్వర్యంలో ఆలయం, వేద భాష గోష్ఠి మఠం, సంస్కృత విద్యాసంస్థ ఏర్పాటు, విద్యార్థులకు వసతిగృహం, కన్వెన్షన్‌ మందిరం ఏర్పాటు చేసేందుకు తమకు భూమిని కేటాయించాలంటూ విశాఖకు చెందిన శ్రీ శారదా పీఠం ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ 2015, 2018లలో మరోసారి శనివారం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. 


ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదన అందడంతో రెండెకరాల స్థలాన్ని కేటాయించేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. ఈ భూమి విలువ మార్కెట్‌ ధర ప్రకారం రూ.12 కోట్లు. గండిపేట మండలం కోకాపేట గ్రామం పరిధిలోని సర్వే నంబరు 240లో 316.04 ఎకరాల పోరంబోకు స్థలం ఉంది. ప్రస్తుతం ఇది హైదరాబాద్‌ పురపాలక అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధీనంలో ఉంది. ఇదే లేఅవుట్‌లో ఖాళీగా ఉన్న 2.34 ఎకరాల స్థలంలో రెండెకరాలను పీఠానికి కేటాయించేందుకు ప్రభుత్వం హెచ్‌ఎండీఏ నుంచి వెనక్కు తీసుకుంది. ఇక్కడ ఎకరా స్థలం మార్కెట్‌ విలువ రూ.12 కోట్లు పలుకుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: