ప్రస్తుతం రోజా గారు ఏపీఐఐసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇది కాక జబర్దస్త్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క ఎమ్మెల్యేగా నగరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఇవి కాక నవరత్నాల హామీల అమలు కూడా రోజా గారికే అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజా గారికి లెక్కలేనన్ని భాద్యతలు చేతిలో ఉన్నాయి. ఇన్ని భాద్యతలు రోజాపై ఉండటంతో రోజాకు మంత్రి పదవి రెండున్నరేళ్ళ తర్వాత కూడా రాకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

 

నిజానికి రోజాకు ప్రస్తుతం ఉన్న కేబినేట్లోనే చోటు దక్కాలి. కానీ కుల సమీకరణల వలన పదవి దక్కలేదు. కానీ ప్రజల నుండి రోజాకు మంత్రి పదవి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వినిపించింది. అందువలన వైసీపీ పార్టీ వెంటనే రోజా గారికి నామినేటెడ్ పదవిని అప్పగించింది. భవిష్యత్తులో ఖచ్చితంగా మంత్రి పదవి హామీని ఇచ్చింది.

 

వచ్చే కేబినేట్లో మాత్రం రోజాకు, ఆళ్ళ రామకృష్ణరెడ్డిగారికి ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి ఇస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న రోజాగారు మంత్రి పదవి పొందుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ కోసం ఎంతో కష్టపడిన రోజా గారికి ఆ కష్టానికి ప్రతిఫలంగా మంత్రి పదవి లభించబోతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: