కరకట్ట మీదున్న అక్రమ కట్టడాల్ని కూల్చేయటం జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్రమ నిర్మాణాలను చేసుకున్న వారంతా బడాబాబులే.  అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో వాళ్ళంతా ఎప్పుడో కోర్టులో కేసులు వేసున్నారు. కూల్చివేత నోటీసులపైనే విచారాణ జరుగుతోంది. కాబట్టి కోర్టు విచారణలో ఉన్న అంశాలపై జగన్ నిర్ణయం తీసుకోవటం జరిగే పనికాదు.

 

ప్రజావేదికను కూల్చేయటమంటే అది జగన్ చేతిలోని పనే కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు. అలాగే చంద్రబాబునాయుడు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా అక్రమ నిర్మాణమే కాబట్టి దాన్ని కూడా కూల్చేయొచ్చు. కానీ మిగిలిన నిర్మాణాల జోలికి మాత్రం జగన్ ఇప్పటికిప్పుడు  వెళ్ళే అవకాశం లేదు.

 

కోర్టులో ఉన్న కేసుల విచారణ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. అక్రమ నిర్మాణాల కూల్చివేత నిర్ణయాన్ని  ఒకవేళ కోర్టు గనుక ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తే అప్పుడు జగన్ నిర్ణయం తీసుకోగలరు. ఈలోపు జగన్ చేయగలిగేది ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాదు కూడదని జగన్ మొండిగా వెళితే కోర్టు ధిక్కార సమస్యలు చుట్టుముడుతాయని జగన్ గుర్తుంచుకోవాలి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: