ఏపీ సీఎం జగన్ అన్నంత పని చేస్తున్నారు.  కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు నివాసం సమీపంలోని ప్రజా వేదికను కూల్చేస్తున్నారు.  కలెక్టర్ సమావేశం తొలిరోజే సమావేశాలు ముగిశాక  ప్రజా వేదిక కూల్చేయాలని  జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

జగన్ ఆదేశాల మేరకు అధికారులు ప్రజా వేదిక కూల్చే పని ప్రారంభించారు.  ప్రజా వేదికలోని సామాన్లను ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు.  కుర్చీలు, ఏసీలు, బల్లలు, ఇతర పనిచేసే సామాగ్రి  అన్నింటిని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తరలించారు.

 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..   అధికారిక కార్యక్రమాల కోసం,  పార్టీ సమావేశాల కోసం  తన నివాసం సమీపంలో ఈ ప్రజావేదిక ను నిర్మించారు.  కృష్ణానది తీరాన కలకత్తా పై ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదన్నది నిబంధన.  దాన్ని అడ్డగోలుగా   ఉల్లంఘిస్తూ  చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 9 కోట్ల ఖర్చుతో ఈ భవనం నిర్మించింది.

 

కరకట్ట పైన ఉన్న ఇతర భవనాలు  కూల్చాలి అంటే  ముందుగా ప్రజావేదిక కూల్చాలని జగన్ భావిస్తున్నారు.  దీన్ని బట్టి చూస్తే  కరకట్ట పైన ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా వదిలే ఆలోచన జగన్ కు ఉన్నట్టు లేదు.   మరి ఈ కూల్చివేతల దుమారం  ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: