ఎమ్మెల్యేలు ఏదైనా పనిమీద  వస్తే నవ్వుతూ రిసీవ్ చేసుకోవాలన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , వారు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించమంటే మాత్రం   నిర్మోహమాటంగా తిరస్కరించాలని  కలెక్టర్ల తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వానిది ఈ తరహా విధానం కాదని, ఎమ్మెల్యేలే  కాదని అంతకంటే పెద్దవారు ఎవరు  సిఫార్స్ చేసిన తిరస్కరించాలని స్పష్టం చేశారు.


 నీతి  నిజాయితీగా ఉండడమే   తన ప్రభుత్వ విధానమని జగన్మోహన్ రెడ్డి  ప్రకటించినప్పటికీ, ఈ విధానం ... సొంత పార్టీ ఎమ్మెల్యేలకైనా రుచిస్తుందా ? అన్నది హాట్ టాఫిక్ గా  మారింది. నవరత్నాల అమలులో తరతమ బేధాలు అవసరం లేదన్న జగన్,నిబంధలు ప్రకారం లబ్ధిదారులకు ఎంపిక చేయాలని సూచించారు . లబ్ధిదారుల ఎంపిక లోను  తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒత్తిళ్లు తీసుకువచ్చిన పట్టించుకోవద్దని చెప్పడం చూస్తుంటే, సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా జగన్ ఝలక్ ఇచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి .


 కలెక్టర్లు తమ విధుల్లో రాజకీయ నేతల జోక్యాన్ని అసలు సహించరు .. ఇక ముఖ్యమంత్రే  సొంత పార్టీ ప్రజాప్రతినిధులనైనా  ఖాతరు చేయవద్దని చెబితే ... ఇక వాళ్ళు ఎవరి మాట అయిన  వింటారా? అన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి. జగన్ ప్రసంగం సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు రుచించకపోయినా... సాధారణ ప్రజలకు మాత్రం తెగ నచ్చేసింది .

 


మరింత సమాచారం తెలుసుకోండి: