కృష్ణానది కరకట్ట పై అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికను  జగన్ సర్కార్ కూల్చేస్తోంది.  జగన్ తన నిర్ణయాన్ని అత్యంత వేగంగా అమలు చేశాడు.  జగన్ దూకుడును అంచనా వేయాలని తెలుగుదేశం నేతలు..  ఇది విధ్వంసక ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 

ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని,  ప్రజా వేదిక కూల్చకుండా ఉపయోగించుకుంటే బాగుండేదని,  చంద్రబాబు పై కక్ష వల్లే ఈ పని చేశారని తెలుగుదేశం నేతలు అంటున్నారు.   అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది.  అదేంటంటే ప్రజా వేదిక అనేది PEB ( pre engineered building).

 

 అంటే ప్రతి ఐటెం assembled. ఎలా అతికించారో అలాగే విప్పతీయచ్చు, కట్టిన ఇంజనీర్ విప్పటం ఎలాగో అనేది manual design ఇస్తాడు, తీసుకెళ్లి ఇంకొక చోట  80% వరకు అదే మెటీరియల్ని Re Use చేసుకోవచ్చు .  అంటే ప్రజా వేదిక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ లేదన్న మాట.

 

ఇక్కడ మనందరం చర్చించాల్సింది కోటి రూపాయలు కూడా విలువ చేయని షెడ్ కి 9 కోట్లు ఎలా ఖర్చు చేశారు..?? ఎందుకు ఖర్చు చేశారు..?? ఎంత అవినీతి జరిగింది?? ఒక కట్టడం లోనే ఇంత పెద్ద అవినీతి జరిగితే, గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఎన్ని కట్టడాల్లో ఎంత అవినీతి జరిగిందని దాని గురించి ఒకసారి ఆలోచించాలి...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: