ఉత్త తెలంగాణను బంగారు తెలంగాణ చేసుడే మన లక్ష్యం అని  కేసీఆర్ గత ఐదారేళ్ళ నుండి అలుపు సొలుపు లేకుండా  తెగ పనిచేసేస్తుండు, కాకుంటే బంగారు ప్లేసులో అప్పు అనే పదం వచ్చి చేరింది అంతే. దానికి మన కేసీయోడు ఏం చేస్తడు పాపం.  అయినా భారత్ దేశంలో  అప్పు లేకపోతే అది పెద్ద వెలితయ్యే.  పైగా మన సంస్కృతి అయ్యే.. అందుకే కేసీఆర్ తెలంగాణను  అప్పుల తెలంగాణ చేసిండు..  లేకపోతే తెలంగాణను మొత్తం  బంగారం చేసేటోడు. దెబ్బకి ప్రజలకు బంగారాన్ని ఏమి చేసుకోవాలో తెలిసేది కాదు, దాంతో  తెగ పరేషాన్ అయ్యేటోరు. ఇయన్నీ దృష్టిలో ఎత్తుకుని మన గులాబోడు గిట్ల అప్పులు చేసుకుంటూ పోతుండు. 


గిప్పుడు ఈ అప్పుల కుప్ప గెదుకంటే నిన్న పార్లమెంట్ లో  ఆర్థిక మంత్రి నిర్మలమ్మ గదేనండి.. ఆంధ్రలో ఉంటూ  ఢిల్లీ కోసం పని చేస్తది గావిడే నిర్మలా సీతారామన్   సీతారామన్.   గివిడ మన తెలంగాణ అప్పు రూ.69517 కోట్ల ఉంటే.. మన ఉద్యమ కింగ్   కేసీఆర్ అధికారం చేపట్టినాక  ఏకంగా రూ.180239 కోట్లకు అప్పు పాకిందని ఈవిడ సెలవిచినాది.  గైతే గీ ఇషయాన్ని గులాబీ సేనలు  కేసీఆర్ చెవిలో ఊదినరు అంట. గీసువంటివి పట్టించుకోకూడదు భయ్ అని మన కేసీఆర్ సారు తెలిపారంట. గయినా ఆర్థిక వేత్తలు కంటే  కేసీఆర్ ఎక్కువ తెలుసయ్యే.. గీ విషయం మనం ఒప్పుకోవాల్సింది. మరి  గా ఆవిడకి కేసీఆర్   


మరింత సమాచారం తెలుసుకోండి: