మంచి మాటకారైనా సరే..  లేక ఎప్పుడూ స్పీచ్ లతో  ఆరితేరిన రాజకీయ నాయకులైన సరే అప్పుడప్పుడు తాము ఇచ్చే స్పీచుల్లో  తడబాట్లు పొరపాట్లు మాట్లాడేస్తుంటారు. సహజంగా ఇలా మాట్లాడి పప్పుగా నామకరణం గావించినకున్నాడు మన లోకేష్ బాబు.  అయితే ఇప్పుడు  ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా  తన స్పీచ్ లో  తడబాట్లుతో  నవ్వులపాలయ్యారు.  జగన్ ఒక విషయం పై మాట్లాడుతూ తానే ముఖ్యమంత్రిని అని అన్న విషయం కూడా మర్చిపోయి చంద్రబాబునే ముఖ్యమంత్రిగా పేర్కొని మొత్తానికి  లోకేష్ లా  తానూ కూడా కామెడీని పండించగలనని జగన్ నిరూపించుకున్నాడు.      


 కాగా జగన్ నోరు జారిన వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఏమైనా  ఆంద్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి తానే అన్న విషయం జగనే నమ్మలేక పోతున్నాడేమో పాపం.  ఇతర పార్టీల శ్రేణులు సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ వేస్తున్నారు. అయితే  జగన్ ముఖ్యమంత్రిగా వినుత్నమైన ఆలోచనలు చేస్తూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తానూ చేయాలనే కసితో పని చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: