ఏపీలో బీజేపీ ఆకర్ష్ ప్రారంభమైంది. నలుగురు రాజ్యసభ ఎంపీలతో పాటు అంబికా కృష్ణ మరికొందరు చోటా నాయకులు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే  చంద్రబాబు వీళ్లని పంపించారన్న రూమర్ ఎక్కువగా ఉంది. నమ్మినబంటుల్లాంటి ఎంపీలు, బాబు–బాలకృష్ణల మాట దాటని అంబికా కృష్ణ, టీడీపీపై మాట పడనివ్వని లంక దినకర్ లాంటి వాళ్లు బీజేపిలో చేరారంటే ఆశ్చర్యమే మరి. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యంలోకి బాబు ఇలానే తన నేతలను పంపి అటుపై నిందలు వేయించి ప్రజల్లో ప్రజారాజ్యాన్ని డీగ్రేడ్ చేయించారని ఓ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో బాబు మళ్లీ ఇలాంటి ప్లానే వేసారా.. బీజేపీని మేనేజ్ చేయడం సాధ్యమా? ఈ విషయంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ చానెల్ లో స్పందించారు.


 

“బీజేపీ ఎదుగుదలే మోదీ – షా కు ముఖ్యం.. ఈ నలుగురు ఎంపీలు టీడీపీతో పొత్తు కుదిరేలా, బాబుపై కేసులు లేకుండా చేసేలా బీజేపీని ఒప్పించడం అసాధ్యం. బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీ కాదు. బాబుతో కలిస్తే బీజేపీకి లాభముందంటేనే చేస్తారు తప్ప టీడీపీని పట్టించుకోరు. రెండు సార్లు బీజేపీతో పని చేసిన బాబుకు వేరే మార్గాలు లేకపోవు. ఏపీలో బీజేపీ బలపడాలంటే ప్రభుత్వంతో పోరాడాలి. అందుకే ముందు టీడీపీని బలహీనపరచి వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లోకి వెళ్తుంది. టీడీపీకి కాదనలేని పరిస్థితులు కల్పించి పొత్తు గురించి ఆలోచిస్తుంది. ఇంకో విధంగా ఆలోచిస్తే తమ పార్టీ  బలపడటం కోసం బీజేపీ నాయకులు చూస్తారు. ఇందుకు ఏ పార్టీని దెబ్బతీయాలన్నా సందేహించరు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు పొత్తంటూ పెట్టుకోవాల్సి వస్తే అప్పటి పరిస్థితులను బట్టి అది టీడీపీ అయినా వైసీపీ అయినా వాళ్లకి ఓకే” అని విశ్లేషించారు.



నిజమే.. చంద్రబాబు ఇలాంటి స్కెచ్ వేసినా దానికి పడిపోయేవారు బీజేపీలో లేరు. అత్యంత స్ట్రాంగ్ గా ఉన్న బీజేపీ కనీసం స్టాండ్ అవ్వాల్సింది ఏపీలో. ఈ నేపథ్యంలో తన లాభం కోసం ఎవరికి నష్టం చేయాలన్నా చేయగలదు. ఇప్పుడు బీజేపీ కరెక్ట్ పొజీషన్ లో ఉంది. ఏపీలో నిలదక్కుకోవాలంటే ఇదే సరైన సమయం. బీజేపీ వేసే అడుగులు ఎవరిని తొక్కేస్తాయో..! ఇప్పటికైతే కండువాలు కప్పి టీడీపీ నాయకులను లాగేస్తోంది. వైసీపీతో ప్రస్తుతానికి గొడవలేమీ లేకపోయినా.. ఈ చెలిమి ఎన్నాళ్లో కాలమే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: