భూమిపై వాతావరణం చాలా స్పీడ్ గా మారిపోతున్నది.  చలికాలంలో సైతం ఎండలు మండిపోతున్నాయి.  ఇక ఎండాకాలం వస్తే చెప్పడానికి వీలులేదు.  బయటకు రావాలంటే బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది.  బయటకు వస్తే ఎండ.. ఇంట్లో ఉంటె ఉక్కపోత.. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు.  


పైగా ఇప్పుడు గల్ఫ్ లో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి.  ఆయిల్ కోసం కావొచ్చు.. ఆధిపత్యం కోసం కావొచ్చు.  లేదంటే వ్యాపారం కోసం కావొచ్చు.  చాలా కాలం నుంచి అమెరికా గల్ఫ్ లో ఆధిపత్యం చెలాయిస్తోంది.  ఇరాక్,కువైట్, సిరియా వంటి దేశాల్లో యుద్దాన్ని చేసింది. 


ఇప్పుడు ఇరాన్ పై కాలు దువ్వుతోంది.  కానీ ఇరాన్ బలహీనమైన దేశం ఏమి కాదు.  గల్ఫ్ లో బలమైన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి.  అందుకే దాడి వరకు వచ్చి ఆగిపోయాడు ట్రంప్.  ఇలాంటి పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే యుద్ధం తప్పనిసరి అయ్యేలా ఉన్నది.  అదే జరిగితే.. యుద్ధం ప్రారంభమైన కొద్దీగంటల్లోనే ప్రపంచంలో చాలా ప్రాంతాలు యుద్ధం కారణంగా తింటాయి.  


ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, దాని చుట్టుపక్కల ఉన్న ఆసియా దేశాలు దీని వలన దెబ్బతినే అవకాశం ఉన్నది.  శత్రుదేశాలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి.  ఇలాంటి సందర్భం వచ్చినపుడు మరో ఆలోచన చేయకుండా యుద్ధంలోకి దూకే అవకాశం ఉంటుంది.  మరో రెండు నెలల వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగితే.. అక్టోబర్ తరువాత మనిషి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: