చంద్రబాబునాయుడు గానీ ఆయనకు మద్దతిస్తున్న మీడియా వ్యవహారం కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నపుడు పార్టీకి చెందిన ఆరుగురు  రాజ్యసభ ఎంపిల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించారు. సరే విదేశాల్లో ఉన్నారు కాబట్టి అప్పట్లో చంద్రబాబు పెద్దగా స్పందించలేదనే అనుకుందాం.

 

కానీ విదేశాల నుండి చంద్రబాబు వచ్చేసి పది రోజులైనా ఇప్పుడు కూడా వాళ్ళ గురించి ఏమీ మాట్లాడటం లేదు. అంటే బిజెపిలోకి ఫిరాయించిన నలుగురు ఎంపిలు చంద్రబాబు అనుమతితోనే వెళ్ళారన్నది వాస్తవం. ఎంపిల ఫిరాయింపు నిజంగానే చంద్రబాబుకు తెలీకుండా జరిగితే ఇంకేమన్నా ఉందా ? చంద్రబాబుతో కలిపి టిడిపి నేతలు, చంద్రబాబుకు మద్దతుగా నిలబదే మీడియా వాళ్ళందరినీ ఇంకా చీల్చి చెండాడుతూ ఉండేది.

 

అధికారంలో ఉండగానే ఎన్నికలకు ముందు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ పై నేతలు, పోలీసులను చంద్రబాబు ఏ విధంగా ఉసిగొల్పారో  అందరూ చూసిందే.  ఇప్పుడు అధికారంలో లేకపోయినా నేతలు, మీడియాను ఉసిగొల్పుండచ్చు కదా ?

 

ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా నేతలు కొందరితో మొక్కుబడిగా ప్రకటనలిప్పించిన విషయం అందరికీ అర్ధమవుతునే ఉంది. ఓ నాలుగు రోజుల తర్వాత వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు మీడియా అయితే వాళ్ళ ఫిరాయింపును పెద్దగా పట్టించుకోనే లేదు. ఫిరాయించిన ఎంపిల్లో సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, సిఎం రమేష్, టిజి వెంకటేష్ లో  మొటి ముగ్గురు చంద్రబాబుకు బినామీలుగా ఎప్పటి నుండో ప్రచారంలో ఉందన్న విషయం తెలిసిందే.  అందుకనే చంద్రబాబు కూడా వాళ్ళ గురించి మాట్లాడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: