గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పాలనలో ఆ పార్టీ ఇమేజ్ చాలా వరకూ డ్యామేజ్ అయ్యింది. అందుకు నిదర్శనమే ఎన్నికల ఫలితాలు. రాజకీయ పార్టీ అన్నాకా గెలుస్తుంది - ఓడుతుంది.. అయితే ఒకసారి ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి పడే ఇమేజ్ చిరకాలం గుర్తుండి పోతుంది. కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని అంతా గమనిస్తూ ఉన్నారు. ఓడిపోయే సమయానికి కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అనే ముద్ర పడింది. ఆ విషయం జనం మదిలో నాటుకుపోయింది.

 

మోడీ తన ఐదేళ్ల పాలనో సాధించింది  ఏమీ లేకపోయినా మళ్లీ కాంగ్రెస్ కు దేశాన్ని అప్పగిస్తే అవినీతి రాజ్యం ఏలుతుందనే ప్రచారాన్ని మాత్రం బాగా సాగించారు. అదే కాంగ్రెస్ ను దెబ్బతీసింది. అవినీతితో పాటు మైనారిటీ మెహర్బానీ రాజకీయం చేయడంతో కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. అవినీతి ఆరోపణలు క్షేత్ర స్థాయిలో పచ్చచొక్కాల దందాలతో పాటు కుల పార్టీ అనే ఇమేజ్ కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్రంలో కమ్మ వాళ్ల రాజ్యం నడుస్తోందనే భావన ప్రజల్లో కలిగింది.

 

చంద్రబాబు కమ్మ కులస్తులకే ప్రాధాన్యతను ఇస్తున్నారు అనే భావన కలిగింది. అక్కడకూ చంద్రబాబు నాయుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలను పెట్టుకున్నారు. బీసీ కాపులకు ఆ అవకాశం ఇచ్చారు. అయితే వారు డమ్మీలే అని.. లోకేష్ అంతా తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడని లంచాలు ఇచ్చినా కమ్మ బిల్లులే పాస్ అవుతున్నాయి తప్ప.. మిగతా వాళ్లను పట్టించుకోవడం లేదనే టాక్ వచ్చింది.

 

ఇలాంటి నేఫథ్యంలో చంద్రబాబు నాయుడు తన పార్టీపై పడిన కుల మరకలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం కమ్మ వాళ్ల పార్టీ కాదని ఒకవేళ కమ్మ వాళ్లే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నట్టు అయితే కుప్పంలో కూడా టీడీపీ ఓడాల్సిందని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో కమ్మ ఓట్లు కేవలం వెయ్యే అని అయినా తను వరసగా మరోసారి అక్కడ నెగ్గినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: