ఎన్నికల ఫలితాల తరువాత బాబు కొన్ని రోజులు మాత్రమే మౌనం వహించారు. అయినా ఆయన మీడియాలో కనిపించకంపోతే పొద్దు గడవదు. ఇక ఇపుడు యధాప్రకారం అనుకూల మీడియాకు న్యూస్ దొరికేలా బాబు ఇక రోజూ మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. 


పరామర్శ యాత్ర అంటూ జగన్ రూట్లో వెళ్తున్నట్లున్నారు. చంద్రబాబు నాయుడు ఇది ఒకటే పాయింట్ అనుకుంటున్నట్లుగా ఉంది. స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపద్యంలో క్యాడర్ ను నిలబెట్టుకోవడం కోసం ఆయన రోజూ శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పిందే చెబుతున్నారు. తాజాగా మళ్లీ టెలికాన్ఫరెన్స్ లీక్ లు కూడా ఆరంభించారు. 


కార్యకర్తల రక్షణ, వారి ఆస్తుల భద్రత మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. 40 శాతానికి పైగా ప్రజలు ఓట్లు వేశారని వారందరినీ రక్షించుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. 40రోజుల్లో ఆరుగురు టిడిపి కార్యకర్తలను హత్య చేయడం కిరాతకమన్నారు. వైసిపి అరాచకాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. టీడీపీ  మద్దతుదారులను గ్రామాలు ఖాళీచేసి వెళ్లాలని వైసిపి వర్గీయులు బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు.


ఇది సరే కానీ ఏపీలో ప్రతిపక్ష నేత మీద కూడా హత్యా యత్నం జరిగిన రోజులు జనం మరచిపోయారనుకుంటున్నారేమో బాబు. దానిని ఎగతాళి చేసి మరీ కోడి కత్తి అంటూ నానా విధాలుగా తమ్ముళ్లతో కలసి అపహాస్యం చేసిన బాబుకు ఇపుడు ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని గుర్తుకు రావడమే పెద్ద విడ్డూరం .


మరింత సమాచారం తెలుసుకోండి: