జగన్ ఏపీ ముఖ్యమంత్రి. ఆయన ప్రతీ రోజూ అన్ని పేపర్లు కచ్చితంగా చదువుతారు. ఆయన డజన్ల కొద్దీ తెలుగు పత్రికలతో పాటు, ఆంగ్ల పత్రికలను కూడా చదువుతునారు. తెల్లారుతూనే లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు.  ఇన్ని తెలుసుకుంటున్న జగన్ ఆ పత్రికను మాత్రం చదవరట.



కానీ జగన్ చదవని తెలుగు పత్రిక ఒకటి ఉంది. జగన్ టేబిల్ మీద ఉన్న అనేక పత్రికల్లో ఆ పత్రిక కనబడదు. ఆ పత్రిక వేరే ఏదీ కాదు. ఆంధ్ర జ్యోతి పత్రిక. ఆ పత్రికాధిపతి రాధాక్రిష్ణ. జగన్ తో వ్యక్తిగతంగా ద్వేషం ఉండడం వల్లనే జగన్ ఆ పత్రికను చదవరని అంటారు.


జగన్ ఇంతగా పట్టింపు పెట్టుకున్నందునే ఆ పత్రిక జగన్ టేబిల్ మీద లేదు. ముఖ్యమంత్రి హోదాలో అన్ని విషయాలు తెలియాలంటే అన్ని పత్రికలు చదవాల్సిందే. మరి జగన్ మాత్రం ఆ ఒక్క పత్రికను పక్కన పెట్టేశారు. 


ఇటీవల సీనియ‌ర్ నేత దాడి వీర‌భ‌ద్ర‌రావుతో భేటీ సంద‌ర్భంగా తీసిన ఒక ఫోటో ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సీఎం జ‌గ‌న్ టేబుల్ మీద పెద్ద ఎత్తున దిన‌ప‌త్రిక‌లు ఉన్నాయి. వాటిల్లో  ఆంగ్ల  ప‌త్రిక‌లు మొద‌లుకొని పెద్ద‌గా ప‌రిచ‌యం లేని దిన‌ప‌త్రిక‌లు ఉన్నాయి.


 ఇన్ని ఉన్నా.. తాను ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక మాత్రం లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. నిత్యం డ‌జ‌నుకు పైగా పేప‌ర్ల‌ను జ‌గ‌న్ చూస్తార‌న్న విష‌యం తాజా ఫోటో స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి. మొత్తానికి జగన్ ఆర్కే విషయంలో ఇంకా గట్టిగానే ఉన్నారనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: