బావమరిది నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చి టిడిపి పూర్వ వైభవానికి కృషి చేయాలని డిసైడ్ అయ్యారట. అదే విషయాన్ని బావ చంద్రబాబునాయుడుకు చెబితే ఆయన కూడా సంతోషించారట. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమిపాలైన విషయం అందరికీ తెలిసిందే. దాంతో పార్టీ నేతల్లో  ఓ విధమైన నైరాస్యం పేరుకుపోయింది.

 

నేతల్లోని నైరాస్యాన్ని పోగొట్టేందుకు బాలకృష్ణ ఎక్కువ సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల విషయాన్ని పక్కనపెట్టినా రామలసీమలో మాత్రం బాలయ్యకు మంచి క్రేజుంది.

 

నిజానికి బాలయ్యకు సొంతంగా వచ్చిన క్రేజుకన్నా సీనియర్ ఎన్టీయార్ నుండి వారసత్వంగా వచ్చిన అభిమానుల సంఖ్యే చాలా ఎక్కువనటంలో సందేహం లేదు. అనంతపురం జిల్లాలోని హిందుపురం నియోజకవర్గంలో బాలయ్యపై ఎంతటి వ్యతిరేకత ఉన్నా మొన్నటి ఎన్నికల్లో రెండోసారి గెలిచారంటే అందుకు సీనియర్ ఎన్టీయార్ పై ఉన్న అభిమానమే కారణం.

 

కాబట్టి ఇదే అభిమానాన్ని నిలుపుకునేందుకు తొందరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటనలు పెట్టుకోవాలని బాలయ్య నిర్ణయించారట. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానంటూ బావయ్య చంద్రబాబు వద్దంటారా ? కాకపోతే పర్యటనల్లో ఎవరిమీద విరుకుపడతారో ? ఎంతమందిని కొడతారో అన్న భయం వెంటాడుతోంది. మొన్నటి వరకూ ఏదో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఇపుడు వీధుల్లో వెంటాడి కొడతానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఊరుకుంటుందా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: