ఒకవైపు ఎన్నికల్లో అతి దారుణమైన పరాజయం... నాయుడు వరసగా తొమ్మిదేళ్ల పాటు పాలించినప్పుడు కూడా ఎదురవవ్వని వ్యతరేకత గత ఐదేళ్ల పాలనకు ఎదురైంది. దానికి బోలెడన్ని కారణాలు. వాటి సంగతలా ఉంటే.. తెలుగుదేశాన్ని కబలించడానికి బీజేపీ సమాయత్తం అవుతూ ఉంది. అనేక రకాల సమీకరణాలు వేసి.. తెలుగుదేశం పార్టీ స్థానంలో తను ప్రత్యామ్నాయంగా ఎదగాని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.

 

బీజేపీ ప్రయత్నాలు ఎంత వరకూ విజయవంతం అవుతాయి అనే లాజిక్ ను పక్కన పెడితే.. బీజేపీ చేస ప్రతి ప్రయత్నం తెలుగుదేశం పార్టీని ఎంతో కొంత మేర ఇబ్బంది పెడతాయని మాత్రం చెప్పక తప్పదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి రాజకీయం అవసరం లేదు.. పార్టీనే ముఖ్యం అని చంద్రబాబు నాయుడు చెబుతున్నారట. 'ఎన్నికలప్పుడు రాజకీయం చేద్దాం.. ఇప్పుడు పార్టీని కాపాడుకుందాం..' అని తన పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

 

అంతే కాకుండా ఏపీలో రాజకీయ దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అందుకే పార్టీ తరఫు బాధితులను పరామర్శించనున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ మేరకు యాత్రలకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. వరసగా షెడ్యూల్ ను ప్రకటిస్తూ ఉన్నారు.

 

ఇక్కడ రాజకీయ దాడులను ఎదుర్కొనడం మాటెలా ఉన్నా.. పార్టీ శ్రేణులు చెదిరిపోకుండా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారని స్పష్టం అవుతోంది. బీజేపీ చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నాలు చేస్తూ ఉండగా.. చంద్రబాబు నాయుడు త్వరగానే అలర్ట్ అయ్యారు. నేతలు వెళ్లిపోయినా.. క్యాడర్ చేజారకుండా.. పార్టీ ఉనికి దెబ్బతినకుండా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను కలుసుకునే పని మొదలుపెట్టినట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: