ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ట్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రతిపక్షం నుంచే మీ నిర్ణయాలు బాగున్నాయి, కానీ అమలు చెయ్యాలి కదా అని పొగుడుతూనే, విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం పసి బిడ్డను నుంచి వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే నిర్ణయాలను తీసుకుని దేశాన్ని మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా అయన నిర్ణయాలు కనిపిస్తున్నాయి. 


ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ గ్రామా విద్యార్థుల కోసం మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరుస్తుంది. గ్రామా విద్యార్థుల మొఖంలో ఆనందాలు కనిపిస్తున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్టే ప్రస్తుతం వైఎస్ జగన్ కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం ఏంటంటే గ్రామా విద్యార్థుల కోసం 100 శాతం ఫీజు రియంబర్స్ మెంట్ ని తీసుకొచ్చారు. 


గ్రమాల్లో ఉన్నవారు లక్షలకు లక్షలు ఫీజులు కట్టడం కష్టమని వారి కోసం నూరు శాతం ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఒక రెగ్యులారిటీ వ్యవస్థను తీసుకువస్తామని, చట్టం కూడా చేస్తామని తెలిపారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం చేస్తామని ప్రకటించారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కలిపించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో గ్రామంలోని పేద ప్రజలు ఎంతో లాభం పొందనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: