మోడీ ఈ దేశ ప్రధాని. ఆయన్ని నానా మాటలు అన్న ఒకే ఒక్క పొలిటీషియన్ చంద్రబాబు. మా ఏపీకి రావద్దు అంటూ నల్ల బ్యాడ్జీలు చూపించారు. ఏపీలో రచ్చ రచ్చ చేశారు. మోడీ కేడీ అంటూ తమ్ముళ్ల చేత అనిపించారు. మోడీ వ్యక్తిగత విషయాలను కూడా జనంలో చర్చకు పెట్టి పరువుని బజారుకు ఈడ్చారు.


అటువంటి చంద్రబాబు ఇపుడు దారుణ పరాజయ భారంతో క్రుంగిపోతున్నారు. కేంద్ర బడ్జెట్ పై బాబు మాట్లాడారు కానీ మోడీ పేరు మాత్రం ఎక్కడా ఎత్తలేదు. మోడీ ఖబడ్దార్ అన్న గొంతులో ఇపుడు మోడీ మాటే లేకుండా పోయింది. కేంద్రం అన్యాయం చేసింది. అలా ఇలా అంటూ మెత్తమెత్తగా బాబు తన కామెంట్స్ పాస్ చేశారు.


తన విమర్శలలో ఎక్కడా ప్రదాని మోడీ పేరు ఎత్తుతున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికి మోడీ పేరు కూడా పలకడానికి బాబు గారు ముందుకు రావడంలేదంటే అంతలా బాబు నొరు  మోడీ కట్టి పడేశారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా మోడీ దేశంలో బలమైన నాయకుడు అనిపించుకున్నారు. ఎందుకంటే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ, సీనియర్ మోస్ట్ లీడర్ బాబు సైతం మోడీ కి జడిసినట్లే కనిపిస్తోందిపుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: