గత కొంత కాలంగా నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పటిదాకా విత్తనాలు రైతులకు సకాలంలో అందజేయలేదని విమర్శించిన లోకేశ్ ప్రస్తుతం బడ్జెట్ గురించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసాడు. నారాలోకేశ్ తన ట్వీట్లలో కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడ్డారు, ఏపీకి రావాల్సిన నిధులు, హక్కులు గాలికొదిలారు. మీకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుండి జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ సాధించారు. 
 
ప్రత్యేక హోదా గురించి ఎటువంటి ఊసు లేదు. మీ పోరాటం ఏది? ఏపీ ప్రయోజనాలను సాధించానికి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని ఇది ప్రజల తరపున డిమాండ్ అని లోకేశ్ అన్నారు. గతంలో చంద్రబాబు ఏపీకి మొండిచెయ్యి చూపిస్తే చంద్రబాబును రాజీనామా చేయమన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు చేయలేదు అని సీఎం జగన్మోహన్ రెడ్డిగారిని లోకేశ్ విమర్శించాడు. 
 
కానీ నారా లోకేశ్ ఏ ట్వీట్లు చేస్తున్నా ప్రజలు లోకేశ్ కు ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. విత్తనాల సేకరణ గత ప్రభుత్వం నవంబర్ నుండి మార్చి వరకు సేకరించాలని కొంతమంది విమర్శించగా మరి కొంతమంది లోకేశ్ ట్విట్టర్ ద్వారా కాకుండా మీడియా ద్వారా విమర్శలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు రాని లోకేశ్ మీడియా ముందుకొచ్చి వైసీపీ ప్రభుత్వంపై ఎప్పుడు విమర్శలు చేస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: