తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం త‌రువాత స్వ‌ర్గీయ ఎన్టీరామారావుతో విభేధించి ఆ పార్టీలో సంక్ష‌భానికి కార‌ణ‌మైన వ్య‌క్తి నాదేండ్ల భాస్క‌ర్‌రావు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రీలీజ్ సందర్భంగా మళ్లీ తెరపైకి వచ్చారు.  తాజాగా నాదేండ్ల మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 1980 దశకంలో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నేడు బీజేపీలో చేరనున్నారు.


కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. బీజేపి చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ప్రారంభించేందుకు అయన వస్తున్నారు. బీజేపీ బలోపేతంపై నేతలకు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.  కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ కి తొలిసారిగా వస్తున్నండంతో ప్రాధాన్యత ఏర్పడింది. అమిత్‌ షా టూర్ నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతుండటం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.తెలంగాణలో కాంగ్రెస్,టీడీపీల నుంచి మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు, ఆయన సీఎంగా ఉన్నారు. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల, తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: