రాష్ట్రంలో ఎవరు వచ్చి తమ సమస్యను చెప్పుకునే జగన్ వారికి హామీ ఇచ్చి తన తండ్రిని మైమరిపిస్తున్నారు.  తన వద్దకు వచ్చి సాయం కోసం ఆర్థించినా.. సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చినా వెనువెంటనే పాజిటివ్ గా రియాక్ట్ కావటమే కాదు.. సానుకూలంగా స్పందిస్తున్న గుణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సింఫుల్ గా చెప్పాలంటే సెర్ప్ లో పని చేస్తున్న కల్యాణ మిత్రులు కొత్త తరహా భయాందోళనలకు గురయ్యారు.


జగన్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారి ఉద్యోగాల్ని తీసేస్తారని.. వారి జీతాలు పెరగవన్న దుర్మార్గ ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ను కలిశారు కల్యాణ మిత్రులు. తమ సమస్యల్ని ఏకరువు పెట్టుకున్న వారు.. తమకున్న సందేహాన్ని కూడా చెప్పుకున్నారు.ఆ వెంటనే స్పందించిన జగన్.. మీకేం  ఫర్లేదు.. నేనున్నా.. మీకెలాంటి అన్యాయం జరగదన్న హామీ ఇచ్చారు.


నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీరే కల్యాణ మిత్రులుగా ఉండి పెళ్లిళ్లు చేస్తారన్న భరోసాను ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి  స్పందించిన తీరు.. ఇచ్చిన హామీతో వారంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక.. వారిని మరింత సంతోషానికి గురి చేస్తూ వారికిస్తున్న ప్రోత్సహాకాల్ని పెంచేందుకు హామీ ఇవ్వటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: