ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఏపిలో జగన్ ప్రభుత్వం వచ్చే సమయానికి ఆర్థిక కష్టాలు చుట్టుముడుతాయని..ఆయన పాలన ఇబ్బందికరంగా ఉంటుందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండబోతున్నారని..వారి జీత భత్యాలు కూడా చెల్లిస్తారా అన్న విమర్శలు వచ్చాయి. 

కానీ ఏపి ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు ఎంతో సంతోషంలో ఉన్నారు. ఇక ఉద్యోగులకు కూడా సీఎం జగన్ సంతోషకరమైన వార్తలు అందిస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నిర్ణయంతో సుమారు 4 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై  రూ.815 కోట్ల భారం పడనున్నదట. జగన్ సీఎం అయ్యాక తొలి క్యాబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 27 శాతం మేర మధ్యంతర భృతి పెంపుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. కాగా, ఈ పెంపు  జూలై మాసం నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: