కుమారస్వామి  ముఖ్యమంత్రి అయినా కూడా రాజకీయాల్లో ఇంకా దేవెగౌడ కుమారమే. ఓ వైపు తుమ్మిదే వూడే ముక్కులా ప్రభుత్వం ఉంటే ఆయన పనిగట్టుకుని అమెరికా బయల్దేరారు. ఆయన అక్కడ ఉండగానే కధ కానిచ్చేద్దామనుకున్న ఎమ్మెల్యేలు సంక్షోభం స్రుష్టించారు.


దాంతో ఇపుడు కర్నాటక లో రాజకీయం రసవత్తరంగా ఉంది. కాంగ్రెస్ ,జెడిఎస్ ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించడానికి వెళ్లినప్పుడు మంత్రి శివకుమార్ వాటిని చించివేయడం వివాదాస్పదం అయింది.దీనిపై బిజెపి నేత ఎడ్యూరప్ప మండిపడ్డారు. సభాపతి కార్యాలయం లోపల శివకుమార్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఎలా చింపుతారని ప్రశ్నించారు.


శివకుమార్ ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని, దీనిని ఖండించాలని ఆయన అన్నారు.ఇందుకు శివకుమార్ స్పందిస్తూ ‘నేనెందుకు చేయకూడదు? వారిని ఫిర్యాదు చేసుకోమనండి. వారు నన్ను జైల్లో పెట్టాలనుకుంటే నేను సిద్ధమే. నేను పెద్ద రిస్క్‌ తీసుకున్నాను’ అని అన్నారు


.‘వారందరూ ఏవేవో కారణాలను కథలుగా చెప్తున్నారు. అవి రాజీనామా చేసేంతటి కారణాలు కావు. ఇది మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అంతా మంచే జరుగుతుందని అన్నారు. నిజంగానే ఎమ్మెల్యేలు రాజీనామా చేయదలిస్తే శివకుమార్ చించివేస్తే మాత్రం ఆగుతారా  ఏది ఎమైనా కర్నాటకం రసవత్తరంగా ఉంది. అదెక్కడకి చేరుతుందో తెలియదు కానీ కుమారస్వామి సర్కార్ కి మాత్రం మొత్తానికి మూడుతున్నట్లే కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: