ఇది కథ కాదు, ఆలా అని నిజమని చెప్పలేం కానీ వినడానికి చాలా చాలా బాగుంది. ఆంధ్ర ప్రదేశ్ అబివృద్ది పరుగులు తియ్యడానికి కొత్త ప్రభుత్వం తేర లేపింది అనడానికి ఆ మాటలే నిదర్శనం, ఆ గుసగుసలు వింటుంటే ఆంధ్రుల మనసు ఆకాశాన్ని తాకుతుంది. తన పాలనలో అవినీతికి చోటులేదు అని, అవినీతి పాలన చేసేలా ఉంటె గత ప్రభుత్వానికి మనకు తేడా ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు మన సీఎం. ఆంధ్ర రాష్ట్రానికి చీకటి తేర తీసేసి కొత్త వెలుగుని తీసుకొస్తున్నాడు మన జగన్ అన్న. 


ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం నుంచి మొదలైన కష్టాలను, అతని కుటుంబ కష్టాలను, రాష్ట్ర కష్టాలను తరిమికొట్టి 9 సంవత్సరాల తర్వాత రాజన్న ప్రభుత్వం తిరిగి వచ్చి, ఇప్పుడిప్పుడే చిమ్మచీకటి పోయి వెలుగు వస్తున్న రోజులలో, తన ప్రభుత్వం నుంచే అవినీతి పుట్టుకొచ్చి, ప్రజలను ఇబ్బంది పెడుతుంది అని తెలిస్తే ఏ రాజు ఒప్పుకుంటాడు, ఏ సీఎం ఒప్పుకుంటాడు. పచ్చని పంటలో కలుపు మొక్కలను, మొక్కలుగా ఉన్న సమయంలోనే తీసి పారేయాడు. 


తన ప్రజలకు హామీ ఇచ్చాడు, తన ప్రజల కష్టాలను చూసాడు, వారి కష్టాల గుండెచొప్పుడుని విన్నాడు, ఆ కష్టాలను తీరుస్తా అని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే మంత్రి వర్గంలో ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది అవినీతికి ముందడులు వేస్తున్నారు. ఆ మంత్రులకు వ్యక్తిగతంగా పిలిచి ''రాజన్న రాజ్యంలో అవినీతికి చోటూ లేదని'' స్పష్టం చేసాడు. మీరు ఇలాగె కొనసాగిస్తే మీ పదవి కాలం 6 నెలలు కూడా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు మన జగన్ అన్న. నా మాటను కాదని మీరు మరోసారి ఇలాంటి అవినీతి పాలనకు తేరా తీస్తే మరొకసారి ఇక్కడికి రాలేరు అని ముందస్తు జాగ్రత్త చెప్పారు జగన్ అన్న. అయితే ఈ వార్నింగ్ కు గురైన వారిలో ఒకరు మహిళా మంత్రి కూడా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా జరిగి ఉంటె మరో 5 ఏళ్లలో మన ఆంధ్ర రాష్ట్రం భారత దేశంలో అభివృదైన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంటుందని నా అభిప్రాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: