కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  మొన్నటి వరకు ఎలాంటి భయం లేదు.  అన్ని సవ్యంగానే ఉన్నాయి.  భయాలు  పెట్టుకోవద్దు అని చెప్పిన కాంగ్రెస్.. జేడీఎస్ సర్కారు ఇప్పుడు సడెన్ గా ఆందోళన చెందుతోంది.  ఏం జరుగుతున్నదో అర్ధంగాక తల పెట్టుకుంటోంది.  


కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది.  మరోవైపు జేడీఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు.  దీంతో సంక్షోభంలో పడింది.  దీనిని కమలనాధులు తమకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు.  


సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతే... ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ నాయకులు గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.  బీజేపీ ఎమ్మెల్యేలకు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేస్తున్నారు.  బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  


వీరికి ఇండిపెండ్ ల మద్దతు కలుపుకుంటే 107 కు పెరుగుతుంది.  ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 119 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.  ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు. వీరంతా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యొచ్చు.  కొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని అప్పుడే తమ రాజీనామాలను ఉప సంహరించుకుంటామని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: