2019 ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘోరమైన ఫలితాలు పొందింది. నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవటం కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతుంది . కానీ తెలుగుదేశం పార్టీ మేలు కోరేవారు మాత్రం జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ భాద్యతలు స్వీకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జూనియర్ తన వాగ్ధాటితో 2009 ఎన్నికలలో చేసిన ప్రచారంలో ప్రజల్లో కూడా జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. 
 
కానీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావుగారు మాత్రం జూనియర్ ఎన్టీయార్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసాడు. జూనియర్ ఎన్టీయార్ ఎవరో తనకు తెలియదని తాను సినిమాలు చూడనని నాదెండ్ల భాస్కర్ రావుగారు వ్యాఖ్యానించారు. ఒకవేళ జూనియర్ ఎన్టీయార్ వచ్చినా తెలుగుదేశం పార్టీ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని నాదెండ్ల భాస్కర్ రావుగారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 
 
తన కొడుకు నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరి తప్పు చేసినట్లుగా నాదెండ్ల భాస్కర్ రావుగారు అభిప్రాయపడ్డారు. 2014లోనే తనకు బీజేపీ నుండి పిలుపు వచ్చినట్లుగా చెప్పారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం జూనియర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీయార్ అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీయార్ ను తక్కువగా అంచనా వేస్తున్నారని, ఎన్టీయార్ పై ఇలాంటి వ్యాఖ్యలేంటని నాదెండ్ల భాస్కర్ రావు గారిని విమర్శిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: